తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో కొత్తగా 7 నవోదయ విద్యాలయాలు, ఏపీలో 8 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. తెలంగాణలోని జగిత్యాల, నిజామాబాద్, కొత్తగూడెం, మేడ్చల్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాలకు నవోదయ విద్యాలయాలను కేటాయించింది. ఏపీలోని అనకాపల్లి, చిత్తూరులో వలసపల్లె, సత్యసాయిలో పాలసముద్రం, గుంటూరులో తాళ్లపల్లె, రొంపిచర్ల, నూజివీడు, నందిగామ, నంద్యాల జిల్లాలోని డోన్‌లో కేవీబీల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.