పాక్ దాడుల్లో ధ్వంసమైన ఇళ్లకు కేంద్రం పరిహారం

58చూసినవారు
పాక్ దాడుల్లో ధ్వంసమైన ఇళ్లకు కేంద్రం పరిహారం
జమ్మూకశ్మీర్ సరిహద్దు గ్రామాల ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. పాక్ సైన్యం దాడుల్లో ధ్వంసమైన ఇళ్లకు పరిహారం ఇవ్వనున్నట్లు కేంద్ర హోం శాఖ మంగళవారం వెల్లడించింది. ప్రధాని మోడీ హామీని వెంటనే అమలు చేస్తూ, రూ.25 కోట్లను విడుదల చేసింది. సరిహద్దులో దెబ్బ తిన్న 2060 ఇళ్లకు ఈ పరిహారం ఇవ్వనున్నారు. పూర్తిగా ధ్వంసమైన ఇళ్లకు రూ.2 లక్షలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.లక్ష అందించనున్నారు.

సంబంధిత పోస్ట్