తెలంగాణ డీఎస్సీ-2024 ఫలితాలు విడుదలైన నేపథ్యంలో మంగళవారం నుంచి ఈనెల 5 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించి అభ్యర్థులకు ఈమెయిల్, SMS ద్వారా సమాచారం ఇస్తామన్నారు. ప్రతి పోస్టుకు 1:3 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించి, అనంతరం 1:1 నిష్పత్తిలో ఎంపిక చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థుల నుంచి వెబ్ ఆప్షన్స్ తీసుకుని, వాటి ఆధారంగా పోస్టింగ్స్ ఇవ్వనున్నారు.