టీమిండియా క్రికెటర్ చాహల్ మరోసారి వార్తల్లో నిలిచాడు. చాహల్ తన భార్య ధనశ్రీ నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే దుబాయ్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో చాహల్ మరో అమ్మాయితో తళుక్కున మెరిశాడు. స్టాండ్స్‌లో కూర్చొని ఆ అమ్మాయితో మ్యాచ్‌ను చూశాడు. ఆ యువతి ప్రముఖ ఆర్జే మహ్వాష్ అని తెలుస్తోంది. చాహల్ మిస్టరీ గర్ల్‌తో కనిపించడంతో కొత్త ప్రియురాలు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.