👉ఆరోగ్య సమస్యలు:
*చర్మం లేతగా ఉండటం వల్ల సూర్యరశ్మి నుండి చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ.
*కంటి సమస్యలు, దృష్టి లోపాలు సర్వసాధారణం.
👉సామాజిక వివక్ష:
*కొన్ని సమాజాల్లో ఆల్బినిజం గురించి తప్పుడు నమ్మకాలు ఉన్నాయి. దీనివల్ల వివక్ష, హింస ఎదురవుతాయి.
*విద్య, ఉద్యోగ అవకాశాలలో అడ్డంకులు, అవమానాలు తప్పవు.
👉మానసిక ఒత్తిడి:
*సమాజం నుండి వచ్చే వివక్ష వల్ల ఆత్మవిశ్వాసం తగ్గి, మానసిక ఒత్తిడి పెరుగుతుంది.