ICC ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు టీమ్ ఇండియా ఘనంగా చేరుకున్న విషయం తెలిసిందే. ఫైనల్‌లో భారత్‌ను ఢీకొట్టే జట్టు ఏది అనేదే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దక్షిణాఫ్రికా - న్యూజిలాండ్ మధ్య బుధవారం జరగబోయే రెండో సెమీస్‌లో ఎవరు గెలుస్తారు?. ఈ నెల 9న జరిగే ఆఖరి పోరులో భారత్‌కు ప్రత్యర్థి ఎవరనేది చర్చగా మారింది. ఈ రెండుజట్లలో ఏ జట్టు వచ్చినా ఫైనల్ విజేత టీమ్ ఇండియానే అని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.