ఛాంపియన్స్ ట్రోఫీ.. కేఎల్ రాహులే మా ఫస్ట్ ఛాయిస్‌ వికెట్‌కీపర్‌: గంభీర్

73చూసినవారు
ఛాంపియన్స్ ట్రోఫీ.. కేఎల్ రాహులే మా ఫస్ట్ ఛాయిస్‌ వికెట్‌కీపర్‌: గంభీర్
ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడనున్న భారత తుది జట్టులో వికెట్‌కీపర్‌గా కేఎల్‌ రాహుల్‌, రిషభ్‌ పంత్‌లలో ఎవర్ని ఎంపిక చేస్తారా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనిపై భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఈ మెగా టోర్నీలో కేఎల్ రాహులే తమ ఫస్ట్ ఛాయిస్‌ వికెట్‌కీపర్‌ అని గంభీర్‌ తెలిపారు. 'ఒకే మ్యాచ్‌లో ఇద్దరు వికెట్‌కీపర్లను ఆడించలేం. ఆటగాడి కన్నా జట్టు ప్రయోజనాలే ముఖ్యం.' అని గంభీర్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్