ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి సంబంధించిన మ్యాచ్‌ల టికెట్ల వివరాలను ఐసీసీ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) సంయుక్తంగా వెల్లడించాయి. మంగళవారం నుంచి మ్యాచ్ టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపాయి. కరాచీ, లాహోర్, రావల్పిండి వేదికగా జరిగే మొత్తం 10 మ్యాచ్‌ల జనరల్ స్టాండ్ టికెట్ ధరలు పాకిస్థాన్ కరెన్సీ ప్రకారం రూ.1,000 నుంచి రూ.1,500 వరకు ఉండనున్నాయి. అంటే భారత కరెన్సీతో పోల్చితే ఈ టికెట్ ధర రూ.310 మాత్రమే.