ఛాంపియన్స్ ట్రోఫీ.. ఆఫ్ఘనిస్తాన్‌పై సౌతాఫ్రికా ఘన విజయం

51చూసినవారు
ఛాంపియన్స్ ట్రోఫీ.. ఆఫ్ఘనిస్తాన్‌పై సౌతాఫ్రికా ఘన విజయం
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా కరాచీ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా తొలి గెలుపుని అందుకుంది. ఆఫ్ఘనిస్తాన్‌పై 107 పరుగుల తేడాతో సఫారీలు ఘన విజయాన్ని సాధించారు. లక్ష్య ఛేదనలో ఆఫ్ఘనిస్తాన్ 43.3 ఓవర్లలో 208 పరుగులకు ఆలౌట్ అయింది. ఆఫ్ఘన్ బ్యాటర్ రహ్మత్ షా(90) ఒంటరి పోరాటం చేశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 315 పరుగుల భారీ స్కోర్ చేసింది.

సంబంధిత పోస్ట్