పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకి చంద్రబాబు షాక్

54చూసినవారు
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకి చంద్రబాబు షాక్
AP: ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని ఎంతో ఆశతో ఎదురుచూసిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే SVSN వర్మకి సీఎం చంద్రబాబు షాకిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వర్మకి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తానని హామీ ఇచ్చిన బాబు.. ఇప్పుడు ఆ హామీని గాలికొదిలేశారు. కాగా, ఎమ్మెల్యే కోటాలో 3 స్థానాలకు ఎమ్మెల్సీ అభ్యర్థులను టీడీపీ పార్టీ ఆదివారం ఖరారు చేసింది. కావలి గ్రీష్మ(SC), బీద రవిచంద్ర (BC), బీటీ నాయుడు(BC)కు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్