అండగా నిలవాల్సిన సీఎం చంద్రబాబు మిర్చి రైతుల కళ్లలో కారం కొడుతున్నారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. మిర్చి ధరలు పతనం కావడంతో రైతులు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు పెట్టుబడి ధరలు కూడా వచ్చే పరిస్థితి లేదని పేర్కొన్నారు. దీంతో తాము పండించిన పంటను తక్కువ ధరకే అమ్ముకుంటూ రైతులు కన్నీళ్లు పెడుతున్నారని తెలిపారు. మిర్చి క్వింటాకు రూ.15 వేల నష్టంతో అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.