ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ సా.4 గంటలకు హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ కు రానున్నారు. తెలంగాణ నేతలు, కార్యకర్తలతో సమావేశమై రాష్ట్రంలో టీడీపీ బలోపేతంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. జిల్లాల వారీగా సభ్యత్వ నమోదు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ, బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ కమిటీలు వేయడంపై నేతలకు దిశానిర్దేశం చేస్తారని సమాచారం. అలాగే టీటీడీపీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై అభిప్రాయం సేకరించనున్నట్లు టాక్.