చంద్ర‌యాన్‌-5 ద్వారా చంద్రుడిపైకి 250 కేజీల రోవ‌ర్

53చూసినవారు
చంద్ర‌యాన్‌-5 ద్వారా చంద్రుడిపైకి 250 కేజీల రోవ‌ర్
చంద్ర‌యాన్‌-5 మిష‌న్‌కు ఇటీవ‌ల కేంద్రం ఆమోదం తెలిపిన‌ట్లు ఇస్రో చైర్మెన్ వీ నారాయ‌ణ‌న్ తెలిపారు. బెంగుళూరులోని ఇస్రో కేంద్రంలో ఆదివారం జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడారు. 2023లో ప్రయోగించిన చంద్రయాన్‌-3లో భాగంగా 25 కిలోల ప్రజ్ఞాన్‌ రోవర్‌ను జాబిల్లిపైకి తీసుకెళ్లార‌ని పేర్కొన్నారు. ఈసారి మాత్రం చంద్రయాన్‌-5 ద్వారా 250 కిలోల రోవర్‌ను చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్‌ చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్