TG: రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులకు మార్చి 6 నుంచి 15వ తేదీ వరకు ప్రీ ఫైనల్ పరీక్షలు జరగనున్నాయి. రంజాన్ పండగ దృష్ట్యా టైమింగ్స్ లో మార్పులు చేశారు. మధ్యాహ్నం 12.15 గంటల నుంచి 3.15 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. దీంతో విద్యార్థులకు మధ్యాహ్నం 12.15 గంటల లోపుపే మధ్యాహ్న భోజనం అందించాలని విద్యాశాఖ సంచాలకుడు నరసింహారెడ్డి ఆదేశాలు జారీ చేశారు.