ప్రతినెల మొదటి మంగళవారం తిరుపతి స్థానికులకు టీటీడీ కల్పిస్తున్న స్థానిక కోటా దర్శనాల్లో ఈనెల స్వల్ప మార్పు చేయడమైనది. ఈనెల మొదటి మంగళవారం అయిన 4వ తేదీ రథసప్తమి పర్వదినం రావడంతో భక్తులు రద్దీని దృష్టిలో ఉంచుకుని రెండో మంగళవారమైన 11వ తేదీకి స్థానిక కోటా దర్శనాలను మార్పు చేయడమైనది. ఈ మేరకు 9వ తేదీ ఆదివారం టోకెన్లను జారీ చేయనున్నారు.