TG: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణతో పాటు శాఖల మార్పులు చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అప్పుడే పనితీరు సరిగాలేని మంత్రులను పక్కన పెట్టి, వారి స్థానంలో కొత్త వారిని తీసుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కాగా నిన్న సీఎం రేవంత్ కొత్త మంత్రులకు తన వద్ద ఉన్న శాఖలను కేటాయించిన విషయం తెలిసిందే. కాగా కేబినెట్‌లో మరో ముగ్గురికి చోటుంది.