సంపన్న వలసదారులను ఆకర్షించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టేందుకు న్యూజిలాండ్ తన గోల్డెన్ వీసా కార్యక్రమాన్ని సరళీకృతం చేయనుంది. దీనిలో భాగంగా ఆంగ్ల భాష ఆవశ్యకతను తొలగించనుంది. ఏప్రిల్ 1 నుంచి యాక్టివ్ ఇన్వెస్టర్ ప్లస్ వీసాను కేవలం రెండు కేటగిరీలకు కుదించనున్నామని, ఆమోదయోగ్యమైన పెట్టుబడుల పరిమితిని విస్తరిస్తామని ఆ దేశ ఇమిగ్రేషన్ శాఖ మంత్రి ఎరికా స్టాన్‌ఫోర్డ్ తెలిపారు.