గాయత్రి మంత్రాన్ని జపిస్తే ఎన్నో ప్రయోజనాలున్నాయి. జీవితంలో పేదరికాన్ని తొలగిస్తుందని పండితులు చెబుతున్నారు. గాయత్రి మంత్రాన్ని పఠిస్తూ, గాయత్రీ మాతను ధ్యానిస్తే పుష్కలమైన ఆర్థిక లాభాలను పొందవచ్చు. ఒత్తిడి, ప్రతికూలతలను తొలగిస్తుంది. జ్యోతిష దోషాలను ప్రక్షాళన చేస్తుంది. విద్యార్థులకు జ్ఞాన సంపదను మెరుగుపరుస్తుంది. చేపట్టే పనుల్లో విజయాన్ని చేకూర్చుతుంది. జన్మ సంబంధ కర్మలు, పాపాలను తొలగిస్తుంది.