చార్‌ధామ్‌ యాత్ర.. ఆర్యన్‌ ఏవియేషన్ కార్యకలాపాలపై తాత్కాలిక నిషేధం

67చూసినవారు
చార్‌ధామ్‌ యాత్ర.. ఆర్యన్‌ ఏవియేషన్ కార్యకలాపాలపై తాత్కాలిక నిషేధం
ఉత్తరాఖండ్‌లోని గౌరీకుండ్‌లో హెలికాప్టర్‌ కుప్పకూలిన ఘటనలో చిన్నారి సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అక్కడి ప్రభుత్వం ప్రమాదాలను నివారించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. చార్‌ధామ్‌ యాత్ర కొనసాగుతున్న వేళ ఆర్యన్‌ ఏవియేషన్ కార్యకలాపాలపై తాత్కాలిక నిషేధం విధించింది. ఆదివారం ఆర్యన్‌ ఏవియేషన్‌కు చెందిన హెలికాప్టర్‌ గుప్తకాశీ నుంచి కేదార్‌నాథ్‌కు వెళ్తూ గౌరీకుండ్‌లో కుప్పకూలింది.

సంబంధిత పోస్ట్