TG: సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఛార్జ్‌షీట్‌లో 13 మందిపై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. ఆరుగురి మృతికి కారణమైన 13 మందిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. కాగా 2023 మార్చి 16న స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఎగ్జిట్ పాయింట్ దగ్గర చెత్త డంప్ చేయడం వల్లే ప్రమాదం జరిగినట్లు గుర్తించారు.