విక్కీ కౌశల్ – రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఛావా’. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా అడ్వాన్స్ టికెట్ బుకింగ్‌లో రికార్డు క్రియేట్ చేసింది. గురువారం ఉదయానికి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ. 9.23 కోట్లు వసూలు చేసిందని చిత్ర బృందం తెలిపింది. కాగా ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ చారిత్రక కథ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది.