బొలీవియా దేశ సైన్యం చేతిలో హతమైన చే గువేరా.. నేటి యువతకు మార్గదర్శకుడిగా, ప్రపంచవ్యాప్తంగా విప్లవ చిహ్నంగా మారారు. అతని జీవితం, ఆలోచనలు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అనేక మందిని ప్రేరేపిస్తూనే ఉన్నాయి. ఆయన ఇప్పటికీ అనేక దేశాలలో యువ నాయకులకు స్ఫూర్తిగా నిలిచారు. విప్లవం ఉన్నంత కాలం చే గువేరా సాహసం, పట్టుదల బ్రతికే ఉంటాయి. ఆయన మన ముందు లేకపోయినా, అతని ఆశయాలు ఎప్పటికీ జీవించి ఉంటాయి.