క్యూబాలో నియంత బాటిస్టాకు వ్యతిరేకంగా ఫిడెల్ కాస్ట్రో ఆధ్వర్యంలో 1956–1959 మధ్య జరిగిన గెరిల్లా పోరాటంలో చే గువేరా కీలక పాత్ర పోషించాడు. 1959 జనవరిలో విప్లవ పోరాటంలో విజయం సాధించి, చే గువేరా కాస్ట్రో అధికారం చేపట్టాడు. చే క్యూబా ప్రభుత్వంలో పరిశ్రమల మంత్రిగా, జాతీయ బ్యాంకు అధ్యక్షుడిగా పనిచేశాడు. క్యూబా ప్రతినిధిగా అనేక దేశాలు పర్యటించి, 1959 జూలైలో భారతదేశంలో కూడా సందర్శించాడు.