మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. విజన్ ప్రాపర్టీ మేనేజ్‌మెంట్ సర్వీస్‌కు ఇవ్వాల్సిన రూ.20 లక్షలు ఇవ్వకుండా మోసం చేశారంటూ యేసుబాబు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. తాజా ఫిర్యాదుతో, BNS చట్టం ప్రకారం చీటింగ్ కేసు నమోదు చేశారు. నేరం రుజువైతే రాజశేఖర్ రెడ్డికి 5 ఏళ్ల జైలు శిక్ష ఉండొచ్చని సమాచారం.