సింగరేణిలో ఉద్యోగం పేరిట మోసం.. భార్యాభర్తల ఆత్మహత్య

74చూసినవారు
సింగరేణిలో ఉద్యోగం పేరిట మోసం.. భార్యాభర్తల ఆత్మహత్య
ఉద్యోగం ఇప్పిస్తానని లక్షల్లో డబ్బులు తీసుకుని మోసం చేశారన్న ఆవేదనతో భార్యాభర్తలు సూసైడ్ చేసుకున్నారు. ఈ ఘటన సోమవారం రాత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రాంనగర్‌లో చోటుచేసుకుంది. సాయిరాం తండాకు చెందిన పార్వతికి ఓ వ్యక్తి కొత్తగూడెంలో సింగరేణి సంస్థలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ రూ.16 లక్షలు తీసుకుని మోసం చేశాడు. మోసపోయి అప్పులు పాలయ్యామన్న మనస్తాపంతో భార్యాభర్తలిద్దరూ గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్