అందరికి నేల ఉసిరి గురించి తెలిసే ఉంటుంది. దీనిని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తుంటారు. ఎక్కువగా మనకు గ్రామాల్లోని పెరట్లో, ఇంటి ముందు, పొలాల్లో ఈ చెట్లు కనిపిస్తుంటాయి. అయితే ఇందులో ఔషధ గుణాలు అధికంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే రుటిన్, క్వర్సెటిన్, రెటినాయిడ్స్ నరాల వ్యవస్థపై అద్భుతంగా పనిచేస్తాయని, వాటి పనితీరును మెరుగు పడేలా చేస్తాయని సూచిస్తున్నారు.