వేసవికాలం వచ్చిందంటే చాలామంది చెమట పొక్కులతో సతమతమవుతుంటారు. వేసవికాలంలో చర్మం ఎర్రగా నీటిపొక్కుల్లా మారి విపరీతమైన మంట వస్తుంది. ఎండాకాలంలో ప్రతి రోజూ రెండు మూడుసార్లు చల్లని నీటితో స్నానం చేయాలి. చెమట పొక్కులు వచ్చిన ప్రాంతంలో కలబంద గుజ్జును రాయాలి. ఇందులో యాస్ట్రింజెంట్ గుణాలు ఉంటాయి. కలబంద చెమట పొక్కుల్ని మాత్రమే కాకుండా కొన్ని రకాల ఇన్‌ఫెక్షన్లను దూరం చేస్తుంది.