కేరళలోని మాక్‌పోల్స్‌ EVMలను తనిఖీ చేయండి

64చూసినవారు
కేరళలోని మాక్‌పోల్స్‌ EVMలను తనిఖీ చేయండి
కేరళ మాక్‌పోల్స్‌లో బీజేపీకి ‘అదనపు ఓట్లు’ నమోదైన ఇవిఎంలను తనిఖీ చేయాలని సుప్రీంకోర్టు గురువారం ఎలక్షన్‌ కమిషన్‌ ని ఆదేశించింది. న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ సమర్పించిన నివేదికలపై జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పరిశీలించింది. EVM ఓట్లతో పాటు వివిప్యాట్‌లలోని స్లిప్‌లను క్రాస్‌ వెరిఫికేషన్‌ జరపాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌లపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది.

ట్యాగ్స్ :