మహిళలకు పెనుశాపంగా మారిన రొమ్ము క్యాన్సర్ చికిత్సలో కీలక ముందడుగు పడింది. రొమ్ము నుంచి సేకరించిన కణజాలాన్ని వారంపాటు భద్రపరిచే కొత్త జెల్ అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ పరిశోధకులు వెల్లడించారు. దీని వల్ల వారికి ఏ మందు బాగా పని చేస్తుందో కనిపెట్టొచ్చు. రొమ్ము క్యాన్సర్ పరిశోధనలకు, క్యాన్సర్ చికిత్సకు ఈ సాంకేతికత ఓ గేమ్ ఛేంజర్ అని పరిశోధకులు అభివర్ణిస్తున్నారు.