ఐపీఎల్ 2025లో భాగంగా చెపాక్ వేదికగా శుక్రవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. CSK ఇంపాక్ట్ ప్లేయర్ దీపక్ హుడా డకౌట్ అయ్యారు. వరుణ్ చక్రవర్తి వేసిన 14.1 ఓవర్‌కు వైభవ్ అరోరాకు క్యాచ్ ఇచ్చి హుడా పెవిలియన్ చేరారు. దీంతో 15 ఓవర్లు పూర్తయ్యేసరికి CSK స్కోరు 74/7గా ఉంది. క్రీజులో దూబే (9), ధోనీ (1) ఉన్నారు.