ఛత్తీస్‌గఢ్ లిక్కర్ స్కామ్ విచారణలో భాగంగా రూ.205 కోట్ల విలువైన ఆస్థులను జప్తు చేసినట్లు ఈడీ శుక్రవారం వెల్లడించింది. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి అనిల్ తుతేజాకు చెందిన రూ.15.82 కోట్ల ఆస్థులను, అన్వర్ దేబార్ చెందిన రూ.116.16 కోట్లు ఆస్థులను, వికాశ్ అగర్వాల్ చెందిన రూ.1.54 కోట్ల విలువైన ఆస్థులను, అర్వింద్ సింగ్ కు చెందిన రూ.12.99 కోట్ల విలువైన 33 ఆస్థులను జప్తు చేసుకున్నట్లు ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది.