కోడి మెడ, తోక భాగాలతో పాటు కోడి ఊపిరితిత్తులను తినకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ భాగాల్లో హానికరమైన క్రిములు, బ్యాక్టీరియాలు ఎక్కువగా ఉంటాయని, ఇవి ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉందని చెప్పారు. అలాగే చికెన్ స్కిన్ ఎక్కువగా తినేవారిలో అనారోగ్యకరమైన కొవ్వులు పేరుకుపోతాయని పలు అధ్యయనాలు తెలిపాయి. అందుకే కార్డియాలజిస్టులు చికెన్ చర్మాన్ని తినవద్దని సలహా ఇస్తుంటారు.