తల లేకుండా 18 నెలలు జీవించిన కోడి

69చూసినవారు
తల లేకుండా 18 నెలలు జీవించిన కోడి
1945లో అమెరికాలోని కొలరాడోలో లాయిడ్ ఓల్సెన్ అనే రైతు కోళ్లను పెంచేవాడు. ఒక రోజు కోడి తలను కత్తిరించగా.. అది చురుగ్గా తిరుగుతూ.. కనిపించింది. అది తల లేకుండా 18 నెలలు జీవించింది. దీంతో ఆ కోడికి మిరాకిల్ మైక్ అని పేరు కూడా పెట్టాడు. తల లేకుండా జీవించడంతో దాన్ని చూడటానికి చాలామంది ఎగబడ్డారు కూడా. అయితే కోడి తల నరికినప్పుడు దాని తలలో ఉండే చిన్న భాగం కట్ కాకపోవడంతోనే అది జీవించినట్లు వైద్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్