కేంద్ర బడ్జెట్‌పై చిదంబరం, ఖర్గే కీలక వ్యాఖ్యలు

60చూసినవారు
కేంద్ర బడ్జెట్‌పై చిదంబరం, ఖర్గే కీలక వ్యాఖ్యలు
కేంద్ర బడ్జెట్‌‌పై కాంగ్రెస్ అగ్రనేత, మాజీ కేంద్రమంత్రి పి.చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త పథకాలు, కార్యక్రమాలతో బడ్జెట్ నిండి ఉందన్నారు. వీటిలో చాలా పథకాలు ప్రభుత్వ సామర్థ్యానికి మించి ఉన్నాయని వ్యాఖ్యానించారు. అటు బడ్జెట్‌పై కాంగ్రెస్ అగ్రనేత మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ.. దేశం మొత్తం ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్యలతో పోరాడుతుంటే, ప్రభుత్వం మాత్రం కేంద్ర బడ్జెట్‌ను ప్రశంసించడంలో బిజీగా ఉందని విమర్శించారు.

సంబంధిత పోస్ట్