తెలంగాణలో ప్రభుత్వ వసతి గృహ విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచిన నేపథ్యంలో సీఎం రేవంత్ ను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, అధికారులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. డైట్ ఛార్జీల పెంపు విషయంలో కమిటీ ప్రతిపాదనను యథావిధిగా అమలు చేయడంపై అధికారులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులకు పోషకాహారం అందేలా డైట్‌లో మార్పులు చేయాలని సీఎం సూచించారు. 10 రోజుల్లో కొత్త డైట్‌ను అందుబాటులోకి తీసుకురావాలన్నారు.