TG: జగిత్యాల జిల్లా ధర్మపురిలో దారుణం చోటుచేసుకుంది. నులిపురుగుల నివారణ మాత్రలు వికటించి చిన్నారి మృతి చెందింది. మాత్ర వేసుకున్న కాసేపటికే సహస్ర అనే చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. చిన్నారి చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. మరో పది మంది కూడా అస్వస్థతకు గురైనట్టు సమాచారం. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.