బస్సు కింద పడి చిన్నారి మృతి (వీడియో)

38చూసినవారు
AP: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ చిన్నారి స్కూల్‌కు వెళ్లిన తొలి రోజే బస్సు కింద పడి ప్రాణాలు కోల్పోయింది. ఎంవీ నగర్‌కు చెందిన హరిప్రియ (5) శుక్రవారం స్కూల్‌కు వెళ్లింది. స్కూల్ ముగిసిన అనంతరం బస్సు దిగి ఇంటికి వెళ్లబోయింది. బస్సు ముందు నుంచి అవతలి వైపు వెళ్తుండగా.. డ్రైవర్ చూసుకోకుండా బస్సు ముందుకు పోనివ్వడంతో ఆ చిన్నారి టైర్ల కింద పడి మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్