రాజస్థాన్‌లో బోరుబావిలో చిక్కుకున్న చిన్నారిని బయటికి తీయడానికి సహాయక చర్యలు కొనసాగుతోన్నాయి. దాదాపుగా 68 గంటల నుంచి బాలిక బోరు బావిలోనే ఉండడంతో పైపుతో ఆక్సిజన్ అందిస్తున్నారు. ప్రస్తుతం చిన్నారి చిక్కుకున్న 160 అడుగుల వరకు గొయ్యిని తవ్వినట్లు ఎన్డీఆర్‌ఎఫ్ అధికారి తెలిపారు. ఇక చిన్నారి ఉన్న బోరుబావికి సమాంతరంగా రంధ్రం చేయాల్సి ఉందని, నేడు ఆ చిన్నారిని బయటకు తీసుకొస్తామని వెల్లడించారు.