TG: ఆర్టీసీ బస్సులో ఓ మహిళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. జోగుళాంబ గద్వాల జిల్లాలోని గువ్వల దిన్నె గ్రామానికి చెందిన పావనికి పురిటి నొప్పులు రావడంతో హాస్పిటల్ వెళ్లడానికి గద్వాల ఆర్టీసీ బస్సు ఎక్కింది. నందిన్నె గ్రామ సమీపంలోకి రాగానే నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో బస్సులోనే ప్రసవించింది. తల్లి, బిడ్డలు క్షేమంగా ఉన్నారని ఆర్టీసీ డ్రైవర్ జీఎన్ గౌడ్ తెలిపారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హాస్పిటల్‌కు తరలించారు.