ఊపిరాడక చిన్నారులు మృతి.. సైబరాబాద్ పోలీసులు హెచ్చరిక

84చూసినవారు
ఊపిరాడక చిన్నారులు మృతి..  సైబరాబాద్ పోలీసులు హెచ్చరిక
పార్క్ చేసిన వాహనాల్లోకి అనుకోకుండా వెళ్ళిన పిల్లలు ఊపిరాడక మృతి చెందుతున్న సంఘటనపై సైబరాబాద్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉండాలని అన్నారు. వాహనాన్ని లాక్ చేయకముందు తనిఖీ చేసుకోవాలన్నారు. 'వాహన తాళాలను పిల్లలకు అందుబాటులో ఉంచకూడదు. వాహనం ఎక్కడ పార్క్ చేసినా లాక్ చేయాలి. రియర్ సీట్ రిమైండర్, చైల్డ్ డిటెక్షన్ అలర్ట్ వంటి భద్రతా పరికరాలను వాహనాల్లో ఏర్పాటు చేసుకోవాలి' అని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్