ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రోడ్లు, ఇల్లు నీట మునుగుతున్నాయి. ఈ క్రమంలో ఓ వీడియో తాజాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కొంతమంది చిన్నారులు తమ క్లాస్ రూమ్‌లో భారీగా చేరిన నీటిలో ఈతకొడుతున్నారు. ఈ వీడియోను ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ ధ్రువ్ రాథీ షేర్ చేశారు. యూపీలో ఇదీ పరిస్థితి సీఎం గారూ అంటూ రాసుకొచ్చారు.