సినిమా థియేటర్లకు రాత్రి 11 తర్వాత 16 ఏళ్లలోపు పిల్లల్ని అనుమతించవద్దు: హైకోర్టు

82చూసినవారు
సినిమా థియేటర్లకు రాత్రి 11 తర్వాత 16 ఏళ్లలోపు పిల్లల్ని అనుమతించవద్దు: హైకోర్టు
సినిమా థియేటర్లకు పదహారేళ్లలోపు పిల్లలు వెళ్లే సమయం వేళలపై అన్ని వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు అప్పటి వరకు 16 ఏళ్లలోపు పిల్లల్ని రాత్రి 11 నుంచి ఉదయం 11 గంటల వరకు థియేటర్లకు అనుమతించవద్దని హైకోర్టు ఆదేశించింది. సినిమా టికెట్ల ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతిపై హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై సోమవారం జస్టిస్ బి. విజయ్‌సేన్ రెడ్డి విచారణ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్