భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) చైనా చర్యలపై ఘాటుగా స్పందించింది. "అరుణాచల్‌ప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు పేర్లు పెట్టేందుకు చైనా ప్రయత్నిస్తున్నట్టు మేము గుర్తించాం. చైనా కుటిల యత్నాలను భారత్ ఖండిస్తోంది. అరుణాచల్‌ప్రదేశ్ భారత్‌కు చెందిన భూ భాగం, అది అంతర్జాతీయంగా అంగీకరించబడిన యథార్థం. ఇప్పుడు, ఎప్పుడు అది భారతదేశానికి చెందిన భూ భాగంగానే కొనసాగుతుంది" అని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.