ఈ ఏడాది చివరలో వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (WAVES) నిర్వహించేందుకు కేంద్రం కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలతో ప్రధాని మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, వారి సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ సమావేశంలో భాగం చేసినందుకు మెగాస్టార్ చిరంజీవి ప్రధాని మోదీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.