మనుషులు తీసుకునే ఆహారంలో, మరీ ముఖ్యంగా మంచినీరులో ‘విబ్రియో కలరే’ అనే సూక్ష్మక్రిమి చేరడం వల్ల కలరా వ్యాపిస్తుంది. కలరా సోకిన మనిషిలో వాంతులు, విరేచనాలు, దాహం, గొంతు పొడిబారిపోవడం, కండరాల నొప్పులు, కడుపునొప్పి.. ఇలా చాలా రకాలైన లక్షణాలు కనిపించవచ్చు. శరీర తత్వాన్ని బట్టి ఈ లక్షణాలు ఒక గంట నుంచి ఐదు రోజుల వరకూ ఎప్పుడైనా బయటపడవచ్చు. ఎలాంటి లక్షణాలు లేనివారు తమకు తెలియకుండానే ఇతరులకు కలరాని అంటించే ప్రమాదం లేకపోలేదు.