AP: నెల్లూరు జిల్లా సంగంలో ఓ మహిళ పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తన చావుకు సీఐ వేమారెడ్డి వేధింపులే కారణనమంటూ జమీల అనే మహిళ సెల్ఫీ వీడియోలో తెలిపింది. చేజెర్ల మండలం ఆదరుపల్లిలో కొంతకాలం క్రితం మక్బూల్ జాన్, జమీల మధ్య ఇంటి వివాదం కొనసాగింది. అయితే విచారణ చేపట్టిన రెవెన్యూ అధికారులు.. ఇల్లు జమీలాదేనని చెప్పారు. ఈ వివాదంలో సీఐ జోక్యం చేసుకుని, తనను 8 నెలలుగా ఇబ్బంది పెడుతున్నారని బాధితురాలు ఆరోపించింది.