అనంతపురం జిల్లా కల్యాణదుర్గం ఎక్సైజ్ సీఐ వివాదంలో చిక్కుకున్నారు. తన పేరు చెప్పి డబ్బు వసూలు చేస్తున్నారంటూ అటెండర్‌పై ఆగ్రహంచిన సీఐ హసీనా భాను.. అటెండర్‌ను నిలదీశారు. కోపంతో ఊగిపోయిన ఆమె చెప్పుతో కొట్టారు. తనకేం తెలియదని చెబుతున్నా వినకుండా కొట్టారని అటెండర్ అంటున్నారు. అనంతపురం ఎక్సైజ్ స్టేషన్‌లో రెండు రోజుల క్రితం ఈ ఘటన జరిగినట్లు సమాచారం. కాగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.