సమగ్ర కుటుంబ సర్వేపై సీఐడీ విచారణ చేపట్టాలి: షబ్బీర్ అలీ

77చూసినవారు
సమగ్ర కుటుంబ సర్వేపై సీఐడీ విచారణ చేపట్టాలి: షబ్బీర్ అలీ
TG: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేపై తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో సర్వేలో జరిగిన అక్రమాలపై సీఐడీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. సర్వే కోసం కేటాయించిన రూ.100 కోట్ల నిధులను దుర్వినియోగం చేశారని లేఖలో ఆరోపించారు. దీనిపై దర్యాప్తు చేయించాలని కోరారు.

సంబంధిత పోస్ట్