AP: ధూమపానానికి బానిసైన ఓ వృద్ధుడు తాను కాలుస్తున్న సిగరెట్ వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ పట్టణంలోని ద్రోణాదుల వారి వీధిలో చోటు చేసుకుంది. చల్లా వెంకటేశ్వరరావు (71) అనారోగ్యానికి గురై మంచానికే పరిమితమయ్యారు. సిగరెట్ వెలిగించి నిద్రలో జారుకున్నారు. అదే సమయంలో భార్య టిఫిన్ కోసం బయటకు వెళ్లింది. సిగరెట్ పీకకు ఉన్న నిప్పు మంచానికి అంటుకుని అగ్ని ప్రమాదానికి గురై మంటల్లో చిక్కుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.