TG: కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రాజెక్టుగా చేసి ఏపీ సీఎం చంద్రబాబుకు గురుదక్షిణ ఇవ్వాలని సీఎం రేవంత్ చూస్తున్నారని BRS మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆరోపించారు. పదవి కాపాడుకునేందుకు రాహుల్ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారని దుయ్యబట్టారు. హామీలను అమలు చేయలేకే కాంగ్రెస్ డైవర్షన్ పోలిటిక్స్ చేస్తోందని చెప్పారు. రేవంత్ కుటిలత్వంపై తెలంగాణ ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు చెలరేగుతున్నాయని వ్యాఖ్యానించారు.